కేరళ స్టోరీ చిత్రాన్ని నిషేధించాలి

ABN , First Publish Date - 2023-05-11T00:29:54+05:30 IST

వినోదాన్ని పంచాల్సిన సినిమా విద్వేషాలను రగిలించేలా ఉన్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని యునైటెడ్‌ జాయింట్‌ యాక్షన కమిటీ కన్వీనర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు.

కేరళ స్టోరీ చిత్రాన్ని నిషేధించాలి

అనంతపురం విద్య, మే 10: వినోదాన్ని పంచాల్సిన సినిమా విద్వేషాలను రగిలించేలా ఉన్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని యునైటెడ్‌ జాయింట్‌ యాక్షన కమిటీ కన్వీనర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్‌ అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం మత పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాఫర్‌ మాట్లాడుతూ... ఒక మతానికి సంబంధించిన వారి మనోభావాలను కించపరుస్తూ....భావోద్వేగాలను రెచ్చగొట్టేలా సినిమా తీశారని మండిపడ్డారు. కేరళలో 32 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ అసత్యప్రచారాలు చేస్తున్న విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గుజరాత రాష్ట్రంలో 41 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. దీనికి అక్కడి ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉందన్నారు. ఇప్పటికే కేరళ స్టోరీ సినిమాను పశ్చిమ బెంగాల్‌ నిషేధించిందని, కేరళ, తమిళనాడు రాషా్ట్రలు సినిమాను ప్రదర్శించకుండా చర్యలు చేపట్టాన్నారు. అదేవిధంగా ఏపీలో సైతం ప్రభుత్వం అధికారికంగా సినిమా ప్రదర్శనను ఆపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం అఖిలపక్షం నాయకులు కలసి జిల్లా కలెక్టర్‌ గౌతమికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు రాజారెడ్డి, శ్రీరాములు కేశవరెడ్డి, లింగమయ్య, నాగరాజు, నగర నాయకులు అల్లిపీరా, చాంద్‌ భాష, బంగారు భాష, ఖాజా, సీఎం నాయకులు నల్లప్ప, ముస్కిన, వలి, కాంగ్రెస్‌ ముస్లిం మైనార్టీ సెల్‌ నాయకలు దాదా గాంధీ, వైసీపీ నేత నదీమ్‌, సైపుల్లా, టీడీపీ నేతలు ఫిరోజ్‌, బాషా, రఫి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-11T00:29:54+05:30 IST