Share News

కంది చేతికందేనా..?

ABN , First Publish Date - 2023-11-22T00:11:45+05:30 IST

ఈ సంవత్సరం ఖరీఫ్‌లో సాగుచేసిన కంది కూడా కందిపోయే పరిస్థితిలో ఉందని రైతులు వాపోతున్నారు.

కంది చేతికందేనా..?
పూత దశలో ఉన్న కందిపంట

తీవ్ర వర్షాభావం, తెగుళ్లతో రైతుల్లో ఆందోళన

చిలమత్తూరు, నవంబరు 21: ఈ సంవత్సరం ఖరీఫ్‌లో సాగుచేసిన కంది కూడా కందిపోయే పరిస్థితిలో ఉందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురవకపో వడంతో అక్కడక్కడ విత్తుకున్న కంది పంట కూడా చేజారినట్లే కనిపిస్తోంది. ఈ ఖరీఫ్‌లో మండల వ్యాప్తంగా 300 ఎకరాల వరకు కంది సాగైంది. అయితే గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా తీవ్ర వర్షాభావం కారణంగా కంది పంట చేతికొచ్చే పరిస్థితి కను చూపుమేరలో కనపడటం లేదు. దీంతో పేదలు పప్పుచారుకు దూరమయ్యారనే చెప్పవచ్చు. సాధారణంగా కందిని వేరుశనగలో అంతరపంటగా సాగుచేస్తారు. వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడంతో కంది సాగు కూడా త గ్గింది. దీని కారణంగా అనుకున్నంత స్థాయిలో పంట సాగుకాలేదు. మం డలంలో అంతంతమాత్రంగా సాగైన కంది పంటకు కూడా వాతావరణం అనుకూలించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో కంది పూత రాలిపోయే ప్రమాదం ఉందంటు న్నారు. అదేవిధంగా పూత దశలో ఉన్న పంటకు అక్కడక్కడ చీడపు రుగు ఆశిస్తోందని రైతులు పేర్కొం టున్నారు. గత ఏడాది కంది పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాక పోవడంతో ప్రస్తుతం మార్కెట్లో కంది పప్పు ధర ఆకాశన్నం టుతోం ది. కిలో రూ. 185 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. దీంతో పేద వారు కందిపప్పు కొని పప్పు చారు తినడానికి దూరమవుతు న్నారు. ఇప్పుడున్న పంటకు వాతా వరణం అనుకూలించి, చీడపురుగు నివారణ జరిగితే కొంతవరకు దిగుబడి చేదికందే అవకాశం ఉంది. లేకపోతే ఈ ఏడాది కూడా కందిపప్పు ధరలకు రెక్కలు వస్తాయనడంలో సందేహం లేదని రైతులంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కందిసాగుపై దృష్టి పెట్టి సస్యరక్షణ చర్యలకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-11-22T00:11:47+05:30 IST