Share News

కమనీయం... సుందర శ్రీకర మహాయాగం

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:15 PM

చంద్రశేఖరేంద్ర సరస్వతి జ్ఞానపీఠం ఆధ్వర్యంలో 2వ రోడ్డులోని ఆ పీఠం ఆవరణలో ఏర్పాటు చేసిన సుందర శ్రీకర మహాయాగం ఆదివారం కమనీయంగా సాగింది.

కమనీయం... సుందర శ్రీకర మహాయాగం
యాగం నిర్వహిస్తున్న వేద పండితులు

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 24 : చంద్రశేఖరేంద్ర సరస్వతి జ్ఞానపీఠం ఆధ్వర్యంలో 2వ రోడ్డులోని ఆ పీఠం ఆవరణలో ఏర్పాటు చేసిన సుందర శ్రీకర మహాయాగం ఆదివారం కమనీయంగా సాగింది. పీఠం అధ్యక్షుడు మధుసూదనరావు నేతృత్వంలో ఈ యాగాన్ని నిర్వ హించారు. అదేవిధంగా చందన హనుమమూర్తిని విశేషంగా అలంకరించి హనుమద్‌ వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి తేనెతో అభిషేకాలు నిర్వహించారు. తద నంతరం అష్టాదశాక్షరి బీజమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం చిన్నారులు రామాయణ నాటక ప్రదర్శనతో అలరించారు.

Updated Date - Dec 24 , 2023 | 11:15 PM