కమాన.. త్వరగా.. రన..!
ABN , First Publish Date - 2023-06-07T00:33:43+05:30 IST
జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తరలివస్తున్నారు.
గ్రూప్ వన పరీక్ష కేంద్రం వద్దకు ఎంబీఏ విద్యార్థి
విషయం తెలియక.. హడావుడి చేసిన అధికారులు
ఆ తరువాత నవ్వుల పువ్వులు
అనంతపురం సెంట్రల్, జూన 6: జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తరలివస్తున్నారు. పరీక్షా కేంద్రంలోనికి ఉదయం 9.45 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. చివరి నిమిషంలో కొంతమంది అభ్యర్థులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కేవలం ఒక్క నిమిషం గడువు ఉండగా.. 9.44 గంటలకు ఒకరు హడావుడిగా వస్తూ కనిపించారు. సమయంలో దాటిపోతుండటంతో పోలీసులు, అధికారులు చొరవ చూపారు. ఎలాగైనా అతనికి సాయం చేయాలని అనుకున్నారు. ‘త్వరగా రా.. పరిగెత్తు.. క్యాలిక్యులేటర్.. ఇతర వస్తువులు ఉంటే బయటే పెట్టెయ్..’ అని అంటూనే.. కొందరు తనిఖీలు మొదలు పెట్టారు. మరికొందరు ఫేస్ రికగ్నైజేషన, ఫింగర్ ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అవి పనిచేయలేదు. ‘అయ్యో పాపం.. సమయం మించిపోయినట్లుంది. అందుకే ఇవి పనిచేయడం లేదు..’ అని అధికారులు, పోలీసులు ఆవేదన చెందారు. గ్రూప్-1 మెయిన పరీక్షలు కదా.. ఎలాగైనా లోపలికి పంపుదామని అనుకుంటే.. ఇలా అయ్యిందేమిటి అని డల్ అయిపోయారు. చివరగా.. అతని చేతిలోని హాల్‌టికెట్ తీసుకుని, ‘ఎక్కడినుంచి వచ్చావు? ఎందుకు ఆలస్యమైంది?’ అని ఆరా తీశారు. హాల్ టికెట్‌లో ‘ఎంబీఏ పరీక్ష’ అని ఉండటంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. ‘ఇదేందయ్యా.. ఎంబీఏ పరీక్షలు రాసేవాడివి ఇక్కడికెందుకు వచ్చావు..? ఇది గ్రూప్-1 మెయిన పరీక్ష కేంద్రం అని తెలియదా..?’ అని ఆ విద్యార్థిని ప్రశ్నించారు. ‘నాకు మాట్లాడే అవకాశం మీరెక్కడ ఇచ్చారు..? త్వరగా రా.. పరిగెత్తు అని హడావుడి చేశారు. అక్కడికీ నేను చెబుతూనే ఉన్నా.. మీరు వింటేకదా..’ అని ఆ విద్యార్థి అన్నాడు. దీంతో మరోమారు అందరూ నవ్వులు చిందించారు. ఆ విద్యార్థి ఎంబీఏ లాస్ట్ చాన్స పరీక్ష రాయాల్సి ఉంది. జేఎనటీయూ ఎగ్జామినేషన బిల్డింగ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికెళ్లాల్సిన విద్యార్థి ఆలస్యం కావడంతో ఆత్రుతలో గ్రూప్ వన పరీక్షా కేంద్రం వద్దకు వచ్చాడు. అందుకే ఇలా జరిగింది.
130 మంది గైర్హాజరు
గ్రూప్-1 మెయిన్స జనరల్ ఎస్సే పేపర్-1సబ్జెక్ట్ పరీక్షలకు 130 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 522 మందికి గాను 392 మంది పరీక్షలు రాశారు. 75.10 హాజరు శాతం నమోదైందని వెన్యూ సూపర్ వైజర్ ప్రొఫెసర్ సుజాత తెలిపారు. పేపర్-2 హిస్టరీ, కల్చరల్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ పరీక్ష బుధవారం ఉంటుందని ఆమె తెలిపారు.