పెళ్లయిన వారానికే...

ABN , First Publish Date - 2023-03-19T00:18:13+05:30 IST

వారం రోజుల క్రితమే పెళ్లయింది.

పెళ్లయిన వారానికే...

అనంతపురం క్రైం, మార్చి18: వారం రోజుల క్రితమే పెళ్లయింది. అన్యూన్యంగా ఉండాల్సిన ఆ దంపతుల్లో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగర శివారులోని రంగస్వామినగర్‌లో నివాసం ఉంటున్న ఓ నవ వధువు ఉరి వేసుకుని మృతి చెందింది. త్రీటౌన సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలు... కర్ణాటక రాష్ట్రంలోని కూటికి ప్రాంతానికి చెందిన శశికళ (26)ను ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన రమే్‌షతో వారం రోజుల క్రితం వివాహమైంది. రమేష్‌ నగరంలోని విజ్ఞాన కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దంపతులు రంగస్వామినగర్‌లో కాపురం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తొలుత భార్యాభర్తలిద్దరూ బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. ఓ అరగంట తరువాత ఆరోగ్యం బాగాలేదని శశికళ బయట హాల్‌లో నిద్రించింది. తరువాత ఏమైందో తెలియదు కానీ మరో గదిలోకి వెళ్లి ఫ్యానకు ఉరి వేసుకుంది. శనివారం ఉదయం నిద్ర లేచి చూసిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో త్రీటౌన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-19T00:18:40+05:30 IST