Share News

జూపల్లి కన్నుమూత

ABN , First Publish Date - 2023-10-19T23:40:37+05:30 IST

అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు అందుకున్న తొలి రాయలసీమ కవి జూపల్లి ప్రేమ్‌చంద్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

జూపల్లి కన్నుమూత

అనారోగ్యంతో..

హైదరాబాద్‌లో తుదిశ్వాస

ఉమ్మడిశెట్టి అవార్డు

అందుకున్న తొలి సీమ కవి

‘ఓట్లన్నీ పోలయినాయి’ కథానికకు రాష్ట్రస్థాయి పురస్కారం

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 19: అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు అందుకున్న తొలి రాయలసీమ కవి జూపల్లి ప్రేమ్‌చంద్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండలో పద్మావతమ్మ, జూపల్లి వెంకట అప్పారావు దంపతులకు 1957 ఫిబ్రవరి 4న జూపల్లి ప్రేమ్‌చంద్‌ జన్మించారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తండ్రి అప్పారావు ఉద్యోగ నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగు సాహిత్యంపై గల ఆసక్తితో ప్రేమ్‌చంద్‌ ఎంఏ తెలుగు, ఎంఫిల్‌, పీహెచ్‌డీని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. తొలినాళ్లలో తెలుగు అధ్యాపకుడిగా, ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2015లో ఆర్ట్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ఆ తరువాత సామాజిక, సాంస్కృతిక రంగాల్లో, సాహిత్య సేవలో మునిగిపోయారు. బోధనా వృత్తిని వదులుకున్నారు. 2004లో అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982లో మంగళగిరికి చెందిన రాజేశ్వరిని జీవితభాగస్వామిగా చేసుకున్నారు. శంతన్‌ మహరాజ్‌, అపర్ణ శౌరీ్‌సలు వీరి సంతానం. 2019 నుంచి ఆయన హైదరాబాదులో కుమారుని చెంత ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాదు బండ్లగూడలోని వారి నివాసానికి తరలించారు.

Updated Date - 2023-10-19T23:40:37+05:30 IST