పారిశుధ్య పర్యవేక్షణ లోపంపై జడ్జి ఆగ్రహం

ABN , First Publish Date - 2023-09-04T23:58:40+05:30 IST

పుట్టపర్తిరూరల్‌ సెప్టెంబరు 4: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో మున్సిపల్‌ అధికారులు, శానిటరీ ఇనస్పెక్టర్‌ సోమశేఖర్‌పై జూనియర్‌ సివిల్‌జడ్జి రాకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుధ్య పర్యవేక్షణ లోపంపై జడ్జి ఆగ్రహం

శానిటరీ ఇనస్పెక్టర్‌పై మండిపాటు

పుట్టపర్తిరూరల్‌ సెప్టెంబరు 4: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో మున్సిపల్‌ అధికారులు, శానిటరీ ఇనస్పెక్టర్‌ సోమశేఖర్‌పై జూనియర్‌ సివిల్‌జడ్జి రాకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిసరాలను జడ్జి సోమవారం పరిశీలించారు. అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో కోర్టు కానిస్టేబుల్‌తో శానిటరీ ఇనస్పెక్టర్‌కు సమాచారం పంపించారు. మున్సిపల్‌ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టకపోవడంపై శానిటరీ ఇనస్పెక్టర్‌కు కబురు పంపి తక్షణం తన ముందు హాజరుకావాలని ఆదేశించారు. శానిటరీ ఇనస్పెక్టర్‌ రాగానే జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎందుకు పారిశుధ్య చర్యలు చేపట్టలేదని, పరిసరాల పరిశుభ్రత మీబాధ్యత కాదా అంటూ ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్‌ ఇనచార్జి కమిషనర్‌ స్వాతి, శానిటరీ ఇనస్పెక్టర్‌ తమ సిబ్బందితో యుద్ధప్రాతిపదికన కోర్టు పరిసరాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉన్న చెత్తను దగ్గరుండి శుభ్రం చేయించారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన అధ్యక్షుడు గంగిరెడ్డి, న్యాయవాదులు శ్రీనివాసులు, రాజేంద్రనాథ్‌రెడ్డి, చల్లా శేఖర్‌, నాగేంద్ర, కోర్టు సిబ్బంది, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:58:40+05:30 IST