2న ఉరవకొండలో ఉద్యోగ మేళా

ABN , First Publish Date - 2023-05-26T23:50:47+05:30 IST

ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన 2న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు.

 2న ఉరవకొండలో ఉద్యోగ మేళా
జాబ్‌ మేళా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గౌతమి

అనంతపురం టౌన, మే26: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన 2న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు. ఈ మేళాకు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ మేళాకు దాదాపు 12 కంపెనీల ప్రతినిధులు వ స్తున్నారన్నారు. టెన్త, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, పీజీ చదివిన అ భ్యర్థులు ఈ మేళాకు అర్హులన్నారు. అయితే 18 సంవత్సరాలు నుండి 35 ఏళ్ల లోపు ఉన్న వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థు లు ఆరోజు నేరుగా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చన్నారు.

Updated Date - 2023-05-26T23:50:47+05:30 IST