జేఎనటీయూ పరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-05-11T00:33:32+05:30 IST

జేఎనటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్‌, ఎంబీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీసీ రంగజనార్దన, రిజిస్ర్టార్‌ శశిధర్‌ ఆనలైన ద్వారా ఫలితాలను బుధవారం విడుదల చేశారు

జేఎనటీయూ పరీక్ష ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ రంగజనార్దన

25 నుంచి అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

అనంతపురం సెంట్రల్‌, మే 10: జేఎనటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్‌, ఎంబీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీసీ రంగజనార్దన, రిజిస్ర్టార్‌ శశిధర్‌ ఆనలైన ద్వారా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ బీటెక్‌ నాలుగో సంవత్సరం ద్వితీ య సెమిస్టర్‌(ఆర్‌19) రెగ్యులర్‌, (ఆర్‌15) సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఆనలైన ద్వారా విడుదల చేశామన్నారు. (ఆర్‌19) రెగ్యులర్‌ పరీక్షలకు 14508మంది విద్యార్థులు హాజరుకాగా 13137మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దీంతో పాస్‌శాతం 90.55గా నమోదైందన్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన రీకౌంటింగ్‌, ఫొటోకాపీ, చాలెంజ్‌ వాల్యుయేషనకు గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. 25నుంచి అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంబీఏ తృతీయ సెమిస్టర్‌(ఆర్‌21) రెగ్యులర్‌, (ఆర్‌ 17) ఫలితాలను కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు వారి ఫలితాలకోసం జేఎనటీయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో రెక్టార్‌ విజయకుమార్‌, డైరెక్టర్‌ సుమలత, డీఈ కేశవరెడ్డి, సీఈ ప్రొఫెసర్‌ చంద్రమోహనరెడ్డి, ఏసీఈలు డాక్టర్‌ మారాల రామశేఖర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ జయలక్ష్మి, డాక్టర్‌ జితేంద్రగౌడ్‌, డాక్టర్‌ శ్రీధర్‌, డీఆర్‌లు రంగానాయక్‌, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-11T00:33:32+05:30 IST