అంగనవాడీలపై కక్షగట్టిన జగన: గుండుమల
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:03 AM
తమ న్యాయమైన డి మాండ్లు నెరవేర్చాలని అంగనవాడీ సిబ్బంది ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డికి చీమకుట్టినట్లయినా లేదని, వారిపై కక్షకట్టారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిరటౌన/గుడిబండ, డిసెంబరు 16: తమ న్యాయమైన డి మాండ్లు నెరవేర్చాలని అంగనవాడీ సిబ్బంది ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డికి చీమకుట్టినట్లయినా లేదని, వారిపై కక్షకట్టారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. వెంటనే వారి సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా అమరాపురం, గుడిబండ మండల కేంద్రాల్లో శనివారం అంగనవాడీల దీక్షా శిబిరాలకు ఆయన వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ కోర్కెల సాధన కోసం అంగనవాడీలు సమ్మె చేపడితే వారిపై కక్షకడుతున్నారని అన్నారు. చివరకు అంగనవాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహిం చాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. కనీసం వారి సమ స్యలు తెలుసుకొనేంత తీరక కూడా ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. వెంటనే వారి సమస్యలు పెంచాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగనవాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అంగనవాడీ కార్యకర్తలు టీడీపీకి మద్దతు పలికి నారాచంద్రబాబునాయుడును సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. అమరాపురం మండల కేంద్రంలో నిర్వహించిన అంగనవాడీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో అంగనవాడీ ఉద్యోగులు వారి చిన్నారులను సైతం ఎండలో వారితోపాటు కూర్చొబెట్టడం అందరినీ కలిచి వేసింది. తల్లులు పడుతున్న ఇబ్బందులు చిన్నారులకు సైతం ఏం పాపం చేశారంటూ చర్చించుకొన్నారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు ఉషారాణి, కార్యదర్శి శ్రీదేవి, సభ్యులు పద్మావతి, సీఐటీయూ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గుడిబండలో టీడీపీ మండల కన్వీనర్ మద్దన కుంటప్ప, నాయకులు దుర్గేష్, మంజునాథ్, లక్ష్మీనరసప్ప, భీమరాజు, శివకుమార్, జయరాం, మల్లికార్జున, కృష్ణమూర్తి, అంగనవాడీ కార్యకర్తల సంఘం నాయకులు మహదేవమ్మ, లక్ష్మీదేవి, నాగవేణి, నాగమణి, దేవీరమ్మ, సుజాత, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.
జగనతోనే రాష్ట్రం వెనుకుబాటు
మడకశిరటౌన, డిసెంబరు 16: అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనకబాటుకు కారణం ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డినే అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుఛిు గుండుమల తిప్పేస్వామి అన్నారు. ఆయన శనివారం అమరాపురం మండలం పుల్లికుంట గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరిస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి భవిష్యత్తు అ న్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. ముఖ్యమంత్రిగా జగనమోహనరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వవైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ ముందుకు సాగుదామన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి, ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు జయకుమార్, మండల కన్వీనర్ గణేష్, నాయకులు శివరుద్రప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : రాబోయే ఎన్నికల్లో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ మండల కన్వీనర్ మద్దనకుంటప్ప పేర్కొన్నారు. వారు శనివారం గుడిబండ పంచాయతీ గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నాయకులు దుర్గేష్, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.