చట్టాలను తుంగలో తొక్కిన జగన

ABN , First Publish Date - 2023-09-20T00:02:48+05:30 IST

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేడ్కర్‌ రాజ్యాం గాన్ని విస్మరించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ చట్టాలను తుంగ లోకి తొక్కుతున్నారని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న మండిప డ్డారు.

చట్టాలను తుంగలో తొక్కిన జగన

మాజీ ఎమ్మెల్యే ఈరన్న

మడకశిర/మడకశిర టౌన, సెప్టెంబరు 19: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేడ్కర్‌ రాజ్యాం గాన్ని విస్మరించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ చట్టాలను తుంగ లోకి తొక్కుతున్నారని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న మండిప డ్డారు. చంద్రబాబు క్షేమంగా అక్రమ కేసు నుంచి బయటకు రావాలం టూ మంగళవారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి రాజీవ్‌గాంధీ సర్కిల్‌ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వినాయక చవితిని పుర స్కరించుకొని అక్కడవినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమేకా కుండా ప్రజల కోసం కూడా పోరాటం కొనసాగిస్తున్నామనిన్నారు. రాష్ట్ర వక్కలిగ కన్వీ నర్‌ వీఎంపాండురంగప్ప, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వత్థరా మప్ప, మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:02:48+05:30 IST