జగనది యూజ్ అండ్ త్రో పద్ధతి: మాజీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:16 AM
ముఖ్యమంత్రి జగన అనుసరిస్తున్న యూజ్ అండ్ త్రో (అవసరానికి వాడుకుని వదిలేసే పద్ధతి) కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మోసపోయారని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు పేర్కొన్నారు.
గుంతకల్లు, డిసెంబరు27: ముఖ్యమంత్రి జగన అనుసరిస్తున్న యూజ్ అండ్ త్రో (అవసరానికి వాడుకుని వదిలేసే పద్ధతి) కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మోసపోయారని మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ జగన ప్రజలనేకాకుండా ఉద్యోగులను, మైనార్టీలను, దళితులను, రైతులను, బంధువులను, తన వారుకున్నవారినందరిని వంచించాడ న్నారు. చివరకు తల్లినీ, చెల్లినీ కూడా వదలలేదన్నారు. చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులపై కూడా కక్షపెంచుకుని ప్రజా వేదికను కూల్చడం, పోలవరాన్ని, రాజధానిని నీరుగార్చిన కుళ్లుబోతు జగన అని విమర్శించారు. సమావేశంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ పవనకుమార్ గౌడు, నాయకులు ఆమ్లెట్ మస్తాన యాదవ్, తలారి మస్తానప్ప, టీ కేశప్ప, హనుమంతు, ముక్కన్నగారి రామాంజనేయులు, బండి లక్ష్మిదేవి, కేసీ రామాంజనేయులు, మహదేవ్, తదితరులు పాల్గొన్నారు.