ఉపాధి సామాజిక తనిఖీలో అవకతవకలు

ABN , First Publish Date - 2023-03-27T00:00:02+05:30 IST

మండలంలో గత పది రోజులుగా సాగుతు న్న ఉపాధి హామీ సామాజిక తనిఖీలో అవకతవకలు చోటుచేసుకు న్నట్లు విమర్శలున్నాయి.

ఉపాధి సామాజిక తనిఖీలో అవకతవకలు

అగళి, మార్చి 26: మండలంలో గత పది రోజులుగా సాగుతు న్న ఉపాధి హామీ సామాజిక తనిఖీలో అవకతవకలు చోటుచేసుకు న్నట్లు విమర్శలున్నాయి. సామాజిక బృందం పర్యటించి ఉపాధి ప నులు, రికార్డులను పరిశీలిస్తోంది. మండల వ్యాప్తంగా 2021-2022 సంవత్సరానికి రూ.7.31 కోట్ల విలువైన పనులు జరిగాయి. అందు లో రూ.5.49 కోట్లు కూలీలకు, రూ.1.64 కోట్లు మెటీరియల్‌ బిల్లుల కింద పంపిణీ చేశారు. అయితే పనులు జరిగినట్లు రికార్డులు ఉ న్నాయే కానీ, వీటిలో కొన్ని పనులకు ఆనవాళ్లు కనిపించడం లేద న్న ఆరోపణలున్నాయి. ఈపనుల బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదని స్థానికులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఫా రంపాండ్స్‌, డక్‌ఔట్‌ పనులు, అమృతసరోవర్‌, పొలాల చుట్టూ కం దకాలు, పండ్ల తోటల పెంపకం, చెరువులు, కాలువలు, చెక్‌డ్యాంల లో పూడికతీత, రెండు గ్రామాల మధ్య మట్టిరోడ్లు, పొలాలకు వెళ్లేదారులు, పనులు జరిగిన క్షేత్రస్థాయిలో ఎక్కడా బోర్డులు కనిపించలేదని తెలుస్తోంది. కోడిపల్లి, ఇరిగేపల్లి, పీ బ్యాడిగెర, అగళి తదితర గ్రామాల్లో పనులకు సరైన ఐడీ నెంబర్లు లేవని తేలింది. కొన్నివారా ల పాటు పనులు చేసినట్లు రికార్డులు తయారుచేసి ఉపాధి సొ మ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. మండల వ్యాప్తంగా జరిగిన సామాజిక తనిఖీల్లో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా అవకతవకలు జరిగినట్లు చర్చ సాగుతోంది. సామాజిక తనిఖీపై ఎం పీపీ రేణుకా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దఎ త్తున అవినీతి భాగోతం జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈవిషయం కమిషనర్‌, కలెక్టర్‌, పీడీ, ఎంపీడీఓ, ఏపీఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయినా ప్రయోజనం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 29న బహిరంగ తనిఖీ సమావేశంలో నిజానిజాలు తేలుతాయన్నారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-27T00:00:02+05:30 IST