Share News

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2023-12-03T00:49:15+05:30 IST

బత్తలపలి,్ల డిసెంబరు 2: అంతర్‌ జిల్లా దొంగ గంగులప్పను అరెస్టు చేసినట్లు సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

బత్తలపలి,్ల డిసెంబరు 2: అంతర్‌ జిల్లా దొంగ గంగులప్పను అరెస్టు చేసినట్లు సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముష్టూరు, విశ్వనాథ్‌పురం గ్రామాలలో గతంలో పొట్టేళ్ల దొంగతనం జరిగింది, కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని ఉప్పర్లపల్లి క్రాస్‌ వద్ద అంతర్‌ జిల్లా దొంగ గంగులప్పతో పాటు అతని కుమారుడు హరిక్రిష్ణను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక పిడిబాకు , రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంగులప్పపై ఇదివరకే అనంతపురం, ముదిగుబ్బ, తనకల్లు, హిందూపురం పోలీస్‌ స్టేషన్లలో దొంగనాలు,డెకాయిట్‌తో పాటు పలు కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. ఈయన గత 12 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడని చెప్పారు.

Updated Date - 2023-12-03T00:51:35+05:30 IST