అన్యాయం జరుగుతోంది... అండగా ఉండండి

ABN , First Publish Date - 2023-05-25T23:29:06+05:30 IST

పట్టణంలో కొత్తగా నిర్మించతలపెట్టిన కదిరిగేటు ఉపరితల వంతెన నిర్మాణం వల్ల తాము నిరాశ్రయులవుతున్నామని, మీరైనా అండగా ఉండాలంటూ బాధితులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ను కలిసి విన్నవించారు.

అన్యాయం జరుగుతోంది... అండగా ఉండండి

పరిటాల శ్రీరామ్‌తో వంతెన బాధితులు

ధర్మవరం, మే 25: పట్టణంలో కొత్తగా నిర్మించతలపెట్టిన కదిరిగేటు ఉపరితల వంతెన నిర్మాణం వల్ల తాము నిరాశ్రయులవుతున్నామని, మీరైనా అండగా ఉండాలంటూ బాధితులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ను కలిసి విన్నవించారు. వారు గురువారం పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో పరిటాలశ్రీరామ్‌ను కలిసి సమస్యను విన్నవించారు. ఉపరితల వంతెన కోసం భూసేకరణ చేస్తున్నారని, ఇది ఏ మాత్రం న్యాయంగా చేయడంలేదన్నారు. మా ఇళ్లు రెండు నుంచి మూడు సెంట్లలో ఉంటే ఒక్కో ఇంటి కొలతను దాదాపు సెంట్‌ తక్కువ చేసి చూపుతున్నారని వారు శ్రీరామ్‌కు వివరించారు. ఈ వంతెన నిర్మాణం కోసం గతంలో స్థానికుల అభిప్రాయ సేకరణ చేపట్టగా... ఉపరితల వంతెనను శ్మశానం మీదుగా నిర్మిస్తే చాలా మందికి మేలుజరుగుతుందని చాలామంది తెలి పారన్నారు. అలాగే భూ సేకరణ ఖర్చుతగ్గుతుందని, శాంతినగర్‌ అభివృద్ధి వారు అభిప్రాయాలు వెల్లడించారన్నారు. ఇవేవీ పట్టించుకోకుడా అధికారులు నేరుగా డిక్లరేషన ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఉన్న మ్యాప్‌ ప్రకారం అనేక మలుపులు ఉన్నాయని, వీటి వల్ల ప్రమాదా లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలాంటి సమస్యలు పట్టించుకో కుండా, బాధితులకు సరైన న్యాయం చేయకుండా ముందుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు కూడా స్టే ఇచ్చిందన్నారు. ఇలాం టి సమయంలో తమకు అండగా ఉండాలని బాధితులు పరిటాల శ్రీరామ్‌ ను కోరారు. స్పందించిన పరిటాలశ్రీరామ్‌ తాను అభివృద్ధికి వ్యతి రేకిని కా దని, అలా అని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేయడం సరి కాద న్నారు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసి తక్కువ మంది ఇళ్లు కోల్పోయే మార్గం వైపు దృష్టి సారించాలన్నారు. అలా కాదని బాధితులకు అన్యాయం చేస్తే వారి తరపున పోరాటాలు చేయక తప్పదని శ్రీరామ్‌హెచ్చరించారు.

Updated Date - 2023-05-25T23:29:06+05:30 IST