సందేశాత్మక సినిమా ‘ఐ క్యూ’

ABN , First Publish Date - 2023-06-03T01:00:48+05:30 IST

నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ‘ఐ క్యూ’ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీనటుడు సుమన అన్నారు. ఐ క్యూ సినిమా విడుదల సందర్భంగా నగరంలోని శాంతి థియేటర్‌లో శుక్రవారం సినిమాను ప్రదర్శించారు.

సందేశాత్మక సినిమా ‘ఐ క్యూ’
మాట్లాడుతున్న సినీనటుడు సుమన

సినీ నటుడు సుమన

‘అనంత’లో సినిమా యూనిట్‌ సందడి

అనంతపురం సిటీ, జూన 2: నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ‘ఐ క్యూ’ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీనటుడు సుమన అన్నారు. ఐ క్యూ సినిమా విడుదల సందర్భంగా నగరంలోని శాంతి థియేటర్‌లో శుక్రవారం సినిమాను ప్రదర్శించారు. ముఖ్యఅతిథులుగా ప్రముఖ సినీనటుడు సుమన, హీరోయిన ట్రాన్సీ, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి హాజరయ్యారు. సినిమా యూనిట్‌ సభ్యులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐ క్యూ సినిమా యువతీయువకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా చిత్రీకరించారని కొనియాడారు. ప్రధానంగా ఈ సినిమాలో నేర విచారణ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయన్నారు. కేఎల్‌పీ మూవీస్‌ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించి, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హీరో, హీరోయిన సాయిచరణ్‌, పల్లవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ శ్రీనివాసులు, రచయిత, సంగీత దర్శకుడు ఘటికాచలం, నటులు రాయల్‌ మురళి, మణికంఠ, డాక్టర్‌ హరి ప్రసాద్‌, క్రిష్ణకుమార్‌, థియేటర్‌ మేనేజర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

అభిమానుల కేరింతలు

నగరంలోని శాంతి థియేటర్‌లో ఐ క్యూ సినిమా యూనిట్‌ సందడి చేశారు. ప్రముఖ నటుడు సుమన రాకతో థియేటర్‌ ప్రాంగణం అభిమానులతో నిండిపోయింది. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. అభిమాన నటుడు సుమనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. సినిమా హీరో, హీరోయినతో పాటు ప్రముఖ హీరోయిన ట్రాన్సీ రాకతో యువత ఉత్సాహం రెట్టింపైంది.

Updated Date - 2023-06-03T01:00:48+05:30 IST