రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2023-04-03T00:19:15+05:30 IST

జపానలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు రెండు రోజుల్లో భారత జట్టును ఎంపిక చేస్తామని జాతీయ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన సీఈఓ ప్రవీణ్‌ అనౌకర్‌ తెలిపారు.

 రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక

జాతీయ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన సీఈఓ ప్రవీణ్‌ అనౌకర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 2: జపానలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు రెండు రోజుల్లో భారత జట్టును ఎంపిక చేస్తామని జాతీయ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన సీఈఓ ప్రవీణ్‌ అనౌకర్‌ తెలిపారు. భారత సాఫ్ట్‌బాల్‌ జట్టు ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఎంపిక పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథు లుగా హాజరైన ప్రవీణ్‌ అనౌకర్‌ మాట్లాడుతూ రెండు రోజుల్లో జపాన దేశంలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జూనియర్‌, సీనియర్స్‌ జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఏప్రిల్‌ 15న మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో మొదటి కోచింగ్‌ క్యాంపు, రెండో శిబిరం పాండిచ్చేరి, మూడో క్యాంపు మధ్య ప్రదేశలోని ఇండోర్‌లో, నాలుగో క్యాంపు ఢిల్లీలో నిర్వహించి అక్కడ నుంచి రెండు జట్లను జూన 21వతేదీ నుంచి జపానలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన జాతీయ కోశాధికారి దేశపాండే, ఏపీ రాష్ట్ర సీఈఓ వెంకటేశులు, సభ్యులు కడప శ్రీప్రసాద్‌, కర్నూలు విజయ్‌, సీనియర్‌ క్రీడాకారుడు బద్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:19:15+05:30 IST