ఇంద.. ఈ రూపాయి తీసుకో..!

ABN , First Publish Date - 2023-02-16T00:26:20+05:30 IST

రేషన కార్డు ఉన్నవారికి ప్రభుత్వం రూపాయకే కిలో బియ్యం వేస్తోంది. యాడికిలో ఓ రేషన డీలర్‌.. దీన్నే రివర్స్‌లో అమలు చేస్తున్నాడు. బియ్యానికి బదులుగా రూపాయ చేతిలో పెడుతున్నాడు. వెరైటీగా ఉంది కదూ..? ఇది కూడా ‘నగదు బదిలీ’ పథకమే అనుకుంటే పోలా..! యాడికి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ దుకాణం-1లో కార్డుదారులకు ఫిబ్రవరి కోటా బియ్యం వేస్తున్నారు.

ఇంద.. ఈ రూపాయి తీసుకో..!
యాడికిలోని రేషన దుకాణం వద్ద బియ్యం కోసం వేచి ఉన్న కార్డుదారులు

రేషన బియ్యానికి బదులుగా.. డబ్బులు

రేషన కార్డు ఉన్నవారికి ప్రభుత్వం రూపాయకే కిలో బియ్యం వేస్తోంది. యాడికిలో ఓ రేషన డీలర్‌.. దీన్నే రివర్స్‌లో అమలు చేస్తున్నాడు. బియ్యానికి బదులుగా రూపాయ చేతిలో పెడుతున్నాడు. వెరైటీగా ఉంది కదూ..? ఇది కూడా ‘నగదు బదిలీ’ పథకమే అనుకుంటే పోలా..! యాడికి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ దుకాణం-1లో కార్డుదారులకు ఫిబ్రవరి కోటా బియ్యం వేస్తున్నారు. కానీ, బియ్యం కోసం వెళ్లిన కొందరికి డబ్బులు ఇస్తున్నారు. అదీ.. కిలో రూపాయ ప్రకారం లెక్కించి, బియ్యం లేవు.. బదులుగా డబ్బులు తీసుకోండి అంటున్నారట. మార్కెట్‌లో కిలో బియ్యం రూ.10 నుంచి రూ.15 వరకూ పలుకుతోంది. కానీ ప్రభుత్వం సబ్సిడీతో రూపాయకే కిలో ఇస్తోంది. ఈ రూపాయనే లెక్కలోకి తీసుకున్నాడు సదరు డీలరు. సివిల్‌ సప్లై అధికారులు బఫర్‌స్టాక్‌ మినహాయించి బియ్యాన్ని సరఫరా చేశారు. కొందరు డీలర్లు బఫర్‌స్టాక్‌ను అప్పటికే నల్లబజారులో విక్రయించారు. దీంతో క్యూలో చివరగా ఉన్న లబ్ధిదారులకు బియ్యం కొరత ఏర్పడింది. అందుకే.. షాపునెంబర్‌ -1లో కిలో బియ్యానికి ఒక రూపాయి ప్రకారం బుధవారం చెల్లించారని పలువురు లబ్ధిదారులు తెలిపారు. గట్టిగా ప్రశ్నించిన వారికి మాత్రమే బియ్యం వేస్తున్నారని, మిగిలిన వారికి నయానో, భయానో డబ్బులు చేతిలో పెట్టి పంపుతున్నారని సమాచారం. ఎండీయూ వాహనాల్లో ఇంటింటికీ వెళ్లి రేషన పంపిణీ చేయాల్సి ఉండగా.. దీనికి మంగళం పలికారు. తాజాగా బియ్యం కూడా పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై సీఎ్‌సడీటీ సూర్యనారాయణను వివరణ కోరగా, బఫర్‌ స్టాక్‌ మినహాయించి రేషన బియ్యం ప్రతి దుకాణానికి అవసరం మేరకు పంపిణీచేశామని అన్నారు. ఎక్కడైనా స్టాక్‌ తక్కువ వస్తే ఉన్నతాధికారులకు నివేదించి బియ్యం సరఫరా చేస్తామని డీలర్లకు చెప్పామని తెలిపారు. - యాడికి

Updated Date - 2023-02-16T00:26:24+05:30 IST