పెంచిన విద్యుత చార్జీలను తగ్గించాలి : బీజేపీ
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:22 AM
రాష్ట్రంలో పెంచిన విద్యుత చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
హిందూపురం అర్బన, డిసెంబరు 21: రాష్ట్రంలో పెంచిన విద్యుత చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వారు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో నాలుగు సార్లు విద్యుత చార్జీలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ట్రూఆప్ చార్జెస్ పేరుతో బిల్లు చూస్తేనే కరెంట్ షాక్ కొట్టేలా ఉన్నాయని ఆగ్రహించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించకుండా పక్కదారి పట్టించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా జోరుగా సాగుతోందన్నారు. సామా న్యులు ఇళ్ల్లు కట్టుకోలేని విధంగా ఇసుక ధరలు పెంచి తనకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు అప్పగాంచారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లు 80 శాతం పూర్తి చేశారని, మిగిలిన 20 శాతం పూర్తి చేయ కుండా నిరుపేదలకు ఇల్లు లేకుండా చేశారన్నారు. నాడు నేడు పేరుతో విద్యా వవస్థనే సర్వనాశనం చేశారన్నారు. పెంచిన విద్యుత చార్జీల ను తగ్గించాలంటూ శుక్రవారం వాసవీ ధర్మశాల వద్ద ఉన్న విద్యుత కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం : ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్‌ను ఉద్దేశించి పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చర్యలను ఖండించాల్సింది పోయి రాహుల్‌గాంధీ ప్రోత్సహిస్తూ వీడియో తీశారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుడిగా చెప్పుకొనే రాహుల్ గాంధీ, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా గురునాథ్ సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ దిషిబొమ్మను దహనం చేశారు.