Share News

పెరిగిన బడ్జెట్‌ కేటాయింపులు

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:09 AM

ధర్మవరం మున్సిపల్‌ కౌన్సిల్‌లో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి.

పెరిగిన బడ్జెట్‌ కేటాయింపులు

ధర్మవరం, డిసెంబరు 29: ధర్మవరం మున్సిపల్‌ కౌన్సిల్‌లో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ భవనంలో ప్రత్యేక బడ్జెట్‌ సమావేశాన్ని శుక్రవారం చైర్‌పర్సన కాచర్ల లక్ష్మీ అఽధ్యక్షతన నిర్వహించారు. జేఏఓ శ్రీనివాసులు బడ్జెట్‌ అంశాలపై చదివి వినిపించారు. 2023-24 సంవత్సరానికి రూ.50,71,98,840 బడ్జెట్‌ అంచనాలు రూపొందించగా మిగులు బడ్జెట్‌ కింద రూ.5,28,67,510 ఉందన్నారు. 2024-25 సంవత్సరానికి రూ.76,82,34,259 బడ్జెట్‌ అంచనాలు రూపొందించారు. మిగులు బడ్జెట్‌ కింద రూ.1,34,38,263 అంచనా వేశారు. అనంతరం చైర్‌పర్సన మాట్లాడుతూ...ధర్మవరం పట్టణ అభివృద్ధికి అందరూ మరింత సహాయ సహకారాలు అందించాలన్నారు. పట్టణంలోని నిరాశ్రయ కేంద్రాలలో తక్కువ మందే ఉన్నారని, వాటికి రూ.16.50లక్షలు బడ్జెట్‌ అవసరమా అని, ఆ కేంద్రాలలో పర్యవేక్షణ కూడా లేదని 24వవార్డు కౌన్సిలర్‌ పురుషోత్తంరెడ్డి చైర్‌పర్సన దృష్టికి తెచ్చారు. కమిషనర్‌ బండిశేషన్న స్పందిస్తూ కమిటీని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. వైస్‌ చైర్‌పర్సన షేక్‌ షంషాద్‌బేగం, మేనేజర్‌ ఆనంద్‌, ఏఈలు ప్రతాప్‌, హరీశ, శానిటరీ ఇనస్పెక్టర్‌ మహబూబ్‌బాషా, కౌన్సిలర్‌లు, కో-ఆప్షన మెంబర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:09 AM