అసమగ్ర భూసర్వే

ABN , First Publish Date - 2023-02-06T23:52:37+05:30 IST

సమగ్ర భూ సర్వే చేసిన తరువాత రైతుల పొలాలకు హద్దులు చూపి, సరిహద్దు రాళ్లు నాటాల్సి ఉంది. అదికాస్త అ సమగ్ర భూసర్వేగా మారిందని కమతంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు.

అసమగ్ర భూసర్వే

పరిష్కారంకాని భూ సమస్యలు

పలు పొలాలకు హద్దురాళ్లు నాటని వైనం

సర్వేపూర్తి అంటూ అధికారుల ఆర్భాటాలు

గాండ్లపెంట, ఫిబ్రవరి 6: సమగ్ర భూ సర్వే చేసిన తరువాత రైతుల పొలాలకు హద్దులు చూపి, సరిహద్దు రాళ్లు నాటాల్సి ఉంది. అదికాస్త అ సమగ్ర భూసర్వేగా మారిందని కమతంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. బ్రిటిష్‌ కాలంలో కొలతలు వేసిన భూములకు సమగ్రంగా భూ సర్వే నిర్వహించి, తిరిగి రైతుల పొలాల హద్దుల వద్ద సరిహద్దు రాళ్లు నాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. మొదట మండలపరిధిలోని కమతంపల్లిని ఎంపిక చేసి భూ సర్వే నిర్వహించింది. ్లగ్రామంలో 2020నుంచి సర్వే నిర్వహించారు. సర్వేయర్లు, రోవర్‌, డ్రోన్ల ద్వారా సర్వే చేశారు. అయితే బ్రిటిష్‌ కాలంలో జరిపిన భూసర్వే ప్రకారం కమతంపల్లిలో 619.56 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత సర్వేలో 613.24 ఎకరాలన్నట్లు తేలింది. ఇప్పటికీ పలువురి భూముల భూ సర్వే సమగ్రంగా జరగలేదని, హద్దులు సరిగా చూపలేదని గ్రామస్థులు చెబుతున్నారు. భూ సర్వే పేరుతో అధికారులు రెండేళ్ల పాటు హడావుడి చేశారేకానీ, ఇప్పటికీ పలువురు రైతుల భూ సమస్యలు పరిష్కరించలేదని అంటున్నారు. భూ సర్వే నిర్వహించిన ప్రతి రైతు పొలంలో ప్రభుత్వమే హద్దు రాళ్లు పాతుతుందని చెప్పారేకానీ... తుతూ మంత్రంగా భూ సర్వే నిర్వహించి, హద్దురాళ్లు పాతారని గ్రామ స్థులు వాపోతున్నారు. వంద సంవత్సరాల నాటి భూములను కొలతలు వేసి, అన్నదమ్ముల మధ్య ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరి స్తున్నా మని గతంలో గ్రామ సభల్లో అధికారులు చెప్పారు. రీ సర్వేకు రూ.లక్షలు ఖర్చు చేసి, హద్దురాళ్లును నాటడానికి ఉపాధి కూలీలను ఉపయోగించారు. వారు కూడా హద్దురాళ్లను రైతుల భూముల హదు ్దల్లో పాతకుండా వంకల్లో, వాగుల్లో, ముళ్ల పొదల్లో వాటిని వదిలేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉన్నా సమగ్ర సర్వే పూర్తి అయిందని రైతులతో వేలిముద్రలు వేయించుకుని యూనిక్‌ నెంబర్లతో పాస్‌పుస్తకాలు అందిస్తామని అధికారులంటున్నారు. కొంతమంది రైతుల పొలాల్లో సర్వే కూడా చేయలేదు. కొలతలు వేయని, హద్దురాళ్లు నాటని భూములకు త్వరలో సర్వే చేసి హద్దురాళ్లు నాటుతామని, అందరూ వేలిముద్రలు వే యాలని రెడెన్యూ అధికారులు చెబుతున్నట్లు రైతులంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులతో వేలిముద్రలు వేయించుకున్నారని, వాటి భూసర్వే నిర్వహించామని అధికారులంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం వెళితే ఆర్డీవోను సప్రందించాలని చెబుతున్నారని వాపోతున్నారు. కొంత మంది భూములు పక్క భూముల రైతుల పేర్లలో నమోదయ్యాయని పలుమార్లు బాధిత రైతులు తహసీల్దార్‌కు విన్నవించుకున్నా, ఫలితం లేదంటున్నారు. పక్కాభూ సర్వే అంటే ఇదేనా అని రైతులు మండి ప డుతున్నారు. ఇంకా కొందరు రైతులు మాట్లాడుతూ రీ సర్వే పేరుతో అధి కారులు తూతూమంత్రగా భూ సర్వే చేసి చేతులు దులిపేసికుంటున్నట్లు వాపోతున్నారు. భూ సమస్యలు అలాగేనిలిచిపోయాయని అంటున్నారు.

ఇంకా భూ సమస్యలుంటే పరిష్కరిస్తాం -రవి, తహసీల్దార్‌

భూ సర్వేని పక్క ప్రణాళికలతో గతంలో ఉన్న అధికారులు నిర్వహిం చారు. ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రైతులతో వేలిముద్రలు వేయించుకుంటున్నాం. ఇంకా భూ సమస్యలుంటే పరిష్కరిస్తాం.

Updated Date - 2023-02-06T23:52:40+05:30 IST