Share News

ఇనచార్జ్‌లు అలసత్వం వహించరాదు

ABN , First Publish Date - 2023-10-25T00:04:56+05:30 IST

పార్టీలోని వివిధ విభాగాల ఇనచార్జులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ బాధ్యతలపట్ల అలసత్వం ప్రదర్శించరాదని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు.

ఇనచార్జ్‌లు అలసత్వం వహించరాదు

- మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లు, అక్టోబరు 24: పార్టీలోని వివిధ విభాగాల ఇనచార్జులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ బాధ్యతలపట్ల అలసత్వం ప్రదర్శించరాదని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వార్డు, క్లస్టర్‌, బూత ఇనచార్జుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జితేంద్రగౌడు మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా వార్డు ఇనచార్జులు, బూత కన్వీనర్లు, క్లస్టర్‌ ఇనచార్జులు వెనకంజ వేయరాదని తెలిపారు. రానున్నదంతా అత్యంత కీలకమైన దశ అని, పార్టీ నేత అందుబాటులో లేని సమయంలో అధైర్యపడకుండా ఎవరిపని వారు నిర్వర్తించాలన్నారు. వార్డులో మొదటగా ఓటరు లిస్టు వెరిఫికేషనను పూర్తిచేయాలని సూచించారు. పార్టీ అధినేత విడుదల కానందున గురువారం తాను తన పుట్టిన రోజులు నిర్వహించడంలేదన్నారు. కనుక కార్యకర్తలు, నాయకులు దానిపై దృష్టిని సారించకుండా ఓటరు లిస్టు వెరిఫికేషనపై దృష్టిని నిలపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్‌ గౌడు, నాయకులు బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, తలారి మస్తానప్ప, టీ కేశప్ప, హనుమంతు, కౌన్సిలరు మహమ్మద్‌ షరీఫ్‌, రాయల వెంకటేశులు, శివప్ప, రామన్నచౌదరి, ముక్కన్నగారి రామాంజనేయులు, లక్ష్మి, మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-25T00:04:56+05:30 IST