జగన పాలనలో కక్షసాధింపులకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-09-25T23:52:58+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షసాధింపుతోనే సీఎం జగన పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.

జగన పాలనలో కక్షసాధింపులకే ప్రాధాన్యం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే

పెనుకొండ టౌన(సోమందేపల్లి), సెప్టెంబరు 25: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షసాధింపుతోనే సీఎం జగన పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మండలంలోని గుడిపల్లి రంగనాథస్వామి ఆలయం నుంచి సోమందేపల్లిలోని పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మనోధైర్యం కల్పించా లని రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్ర ను కొనసాగించారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి 17రోజులు కావస్తోందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాం తాల నుంచి, ప్రపంచంలో పలు దేశాలలో చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. పలు కేసులపై 16నెలలు జైలులో ఉన్న సైకో సీఎం ఓ దొంగ అని, అలాంటి వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నా డ న్నారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేసి, ఎందరికో ఉపాధి కల్పించిన మా నేత జైలులో ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ దుర్మార్గమైన పాలనపై ఈ 17రోజుల నుంచి ఎక్కడ చూసినా వ్యతిరేకత మొదలైందన్నారు. తెలంగాణ, తమిళ నాడు తదితర ప్రాంతాల్లోని నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏది ఏమైనా న్యాయం చంద్రబాబు పక్షాన ఉందని ఇప్పటికీ బెయిల్‌ కోసం వెళ్లలేదన్నారు. మా నేతపై పెట్టిన 17ఏ కేసు అక్రమమని పోరాటం చేస్తు న్నామన్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కురుబ కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు సురేష్‌, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, పాలడుగు చంద్ర, గోపాల్‌యాదవ్‌, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, అనసూయ, సుజాతమ్మ, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ బేబి, లీలావతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:52:58+05:30 IST