చెరువు నుంచి మట్టి అక్రమ రవాణా
ABN , First Publish Date - 2023-06-26T00:12:49+05:30 IST
మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శ్రీచిక్కణ్ణేశ్వర ఒడయార్ చెరువు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
కణేకల్లు, జూన 25: మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శ్రీచిక్కణ్ణేశ్వర ఒడయార్ చెరువు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక హిటాచి యంత్రం సాయంతో మట్టిని తోడి టిప్పర్ల ద్వారా కణేకల్లులోని ఓ లేఔట్‌కు తరలించారు. ఇటీవల మండల కేంద్రంలోని ఉరవకొండ రోడ్డులో వేసిన లేఔట్‌కు యర్రమట్టి ఆవశ్యకత ఉండగా కణేకల్లు చెరువులో ఉన్న యర్ర మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. విలేక రులు ఈ విషయాన్ని అధికారులకు తెలప గా హెచ్చెల్సీ ఏఈ అల్తాఫ్ వర్కర్‌ను పంపి యర్రమట్టిని రవాణా చేయరాదని అడ్డుకున్నారు. దీంతో సంఘటన స్థలం నుంచి టిప్పర్లు వెళ్లిపోయాయి.