Share News

ఐదు సంఘాల్లో అక్రమ లావాదేవీలు

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:55 PM

పట్టణంలోని ఎస్‌బీఐ ఏడీబీలో ఓ అధికారి తన చేతివాటం ప్రదర్శించి రూ. రెండుకోట్లు వరకు గోల్‌మాల్‌ జరగడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై మెప్మా అధికారి శ్రీనివాసరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు.

ఐదు సంఘాల్లో అక్రమ లావాదేవీలు

: మెప్మా అధికారి కదిరి, డిసెంబరు 30: పట్టణంలోని ఎస్‌బీఐ ఏడీబీలో ఓ అధికారి తన చేతివాటం ప్రదర్శించి రూ. రెండుకోట్లు వరకు గోల్‌మాల్‌ జరగడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై మెప్మా అధికారి శ్రీనివాసరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఐదు సంఘాల ఖాతాల్లో రూ. 97లక్షలు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నా రు. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశామని, ఎస్‌బీఐ ఏడీబీలో 11 గ్రూపులను ఆసరా వడ్డీకోసం అక్కడే ఖాతాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో ఐదు గ్రూపుల్లో అవకతవకంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని వివరించారు. అక్రమాలపై పూర్తి విచారణ చేస్తున్నామని, మరికొన్ని గ్రూపుల్లోకూడా ఇటువం టి జరిగినట్లు సమాచారం తమకు ఉందన్నారు. విచారణ తర్వాత అన్ని విషయా లను వెల్లడిస్తామన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న

మెప్మా అధికారి శ్రీనివాసరెడ్డి

Updated Date - Dec 30 , 2023 | 11:55 PM