దోభీఘాట్ బోరు నుంచి అక్రమంగా పైప్‌లైన
ABN , First Publish Date - 2023-12-10T23:42:19+05:30 IST
కనగానపల్లి మండలం కోనాపురం గ్రామంలో అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన దోభీ ఘాట్ బోరుబావి నుంచి అక్రమంగా తన పొలానికి పైప్‌లైన వేసుకున్నాడు
వైసీపీ నాయకుడి అధికార దర్పం
ధర్మవరంరూరల్, డిసెంబరు 10: కనగానపల్లి మండలం కోనాపురం గ్రామంలో అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన దోభీ ఘాట్ బోరుబావి నుంచి అక్రమంగా తన పొలానికి పైప్‌లైన వేసుకున్నాడు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో 2017లో నాటి మంత్రి పరిటాల సునీత సహకారంతో 5లక్షలతో గ్రామంలోని రజకులకు దోబీఘాట్‌ను నిర్మించి.. బోరు వేయించారు. అయితే ఆ బోరుని అక్రమించుకుని ఆ నీటిని ఓ వైసీపీ నాయకుడు సమీపంలో ఉన్న తన పొలానికి వాడుకొంటున్నాడు. నీరులేకపోవడంతో రజకులు ఆ దోభీ ఘాట్ వద్దకు వెళ్లడంలేదు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి అక్రమణకు బోరుబావిని దోబీఘాట్ అమర్చాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.