జగన కక్షసాధింపుతోనే బాబుపై అక్రమ కేసు: ఈరన్న
ABN , First Publish Date - 2023-09-25T23:56:35+05:30 IST
సైకో ము ఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కక్షసా ధింపు కోసమే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు నమో దు చేయించారని మాజీ ఎమ్మెల్యే మద్దన కుం ట ఈరన్న విమర్శించారు.

గుడిబండ, సెప్టెంబరు 25 : సైకో ము ఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కక్షసా ధింపు కోసమే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు నమో దు చేయించారని మాజీ ఎమ్మెల్యే మద్దన కుం ట ఈరన్న విమర్శించారు. గుడిబండ హను మాన థియేటర్ ఆవర ణంలో సోమవారం ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనతో రిలే నిరాహారదీక్ష లు చేపట్టారు. ఈ సందర్భంగా ఈరన్న మా ట్లాడుతూ... చంద్రబాబు రోడ్‌షోలకు, నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రజలు నీరాజనం పడు తుండగా చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన కక్షగట్టి చంద్రబాబుపై అక్రమ కేసు నమోదుచే యించి, జైలుకు పంపారన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 2024ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు పగ్గాలు చేపట్టడం ఖాయ మన్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్ర బాబు నాయుడును జైలులో ఉంచడంతో దేశ విదే శాల్లో ఉన్న తెలుగు ప్రజలు నిరసన ర్యాలీ లు, కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉందన్నా రు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వెంటనే చం ద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ రావాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండురంగప్ప, ఆదినారాయణ, అశ్వత్థామప్ప, సుధాకర్, ఉగ్ర నరసింహప్ప, మందలపల్లి మారేగౌడ్, జయరాంరెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన ప్రకాశ తదితరులు పాల్గొన్నారు.