సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:14 AM
అంగనవాడీల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం జగనను నాలుగున్నరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి అంగనవాడీల హెచ్చరిక.. కలెక్టరేట్ వద్ద రెండోరోజు నిరసన
అనంతపురం విద్య, డిసెంబరు 13: అంగనవాడీల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం జగనను నాలుగున్నరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం రెండో రోజు అంగనవాడీలు నిరసనను కొనసాగించారు. వారి సమ్మెకు టీడీపీ, టీఎనటీయూసీ, జనసేన, సీపీఎం, సీఐటీయూ సంఘీభావం తెలిపాయి. టీఎనటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం, జనసేన అనంతపురం అర్బన ఇనచార్జ్ టీసీ వరుణ్ ఇతర నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలో సీపీఎం నాయకుడు ఆర్వీ నాయుడు, సీఐటీయూ నాయకులు గోపాల్, వెంకట నారాయణ ప్రసంగించారు. అంగనవాడీలకు ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలని, రిటైర్మెంట్ తర్వాత వేతనంలో సగం పెన్షనగా అందజేయాలని కోరారు. అంగన్వాడీల సమ్మెకు అధికార పార్టీనే కారణమని విమర్శించారు. ఫేస్ రికగ్నైజేషన యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, పనిభారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన నాయకులు అరుణ, నక్షత్ర, జమున, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.