రైతులను ఆదుకోకుంటే పోరాటమే

ABN , First Publish Date - 2023-06-26T00:00:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోకుంటే పోరాటమేనని సీపీఐ నాయకులు హెచ్చరించారు

రైతులను ఆదుకోకుంటే పోరాటమే
సమావేశంలో మాట్లాడుతున్న జగదీష్‌

నేటి నుంచి జీపు జాతా : సీపీఐ

అనంతపురం విద్య, జూన 25: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోకుంటే పోరాటమేనని సీపీఐ నాయకులు హెచ్చరించారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఏపీ రైతు సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ మాట్లాడారు. సాగు సాయం కింద రైతులకు ఎకరాకు రూ. 10వేలు చెల్లించాలని, వరుస కరువులతో అపార నష్టాలు ఎదుర్కొంటున్న అనంత రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి జూలై 2 వరకూ జీపు జాతా నిర్వహిస్తామని, జూలైౖ 3న అన్ని సచివాలయాల వద్ద, 10, 11 తేదీల్లో మండల కేంద్రాల్లో, 17,18,19 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలుపుతామన్నారు. జూలై 26 నుంచి 30 వరకూ విజయవాడలో దీక్షలు, 31న నిరవధిక దీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి చిన్నప్ప, ఇతర నాయకులు వన్నారెడ్డి, రామకృష్ణ, గోపాల్‌, మనోహర్‌, రాము, మధు పాల్గొన్నారు.

కూలీలకు పనులు కల్పించాలి: జాఫర్‌

వ్యవసాయ కూలీలకు సొంత గ్రామాల్లోనే కూలిపనులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. జాబ్‌ కార్డులున్న వారికి 200 పని రోజులు కల్పించాల న్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఇతర నాయకులుపెద్దయ్య, నాగరాజు, శివ,దేవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:00:03+05:30 IST