వీసీగా కొనసాగేందుకే విగ్రహ రాజకీయం
ABN , First Publish Date - 2023-07-21T00:45:29+05:30 IST
ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి తన పదవీ కాలం కొనసా గింపునకు ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల నాయకులు మండిపడ్డారు.
అనంతపురం సెంట్రల్, జూలై 20: ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి తన పదవీ కాలం కొనసా గింపునకు ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల నాయకులు మండిపడ్డారు. వర్సిటిలో వైస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఏర్పాటును ఖండిస్తూ ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కుళ్లాయిస్వామి, చిరంజీవి గురువారం నిరసన తెలిపారు. ఎస్కేయూ వీసీ పదవిని అర్హతలేని రామకృష్ణారెడ్డికి కట్టబెట్టి విద్యా ర్థుల భవిష్యత్తును ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ కాలరాశారన్నారు. రామకృష్ణారెడ్డి తన మూడేళ్ల పదవీకాలంలో వేలాది మంది విద్యార్థులను డీటైన చేయడం, ఫీజులు పెంచారన్నారు. అదేవిధంగా ఉద్యోగులను సంస్పెండ్ చేయడం, ఉద్యోగోన్నతుల్లో మామూళ్లు ఇచ్చిన వారికి పదోన్నతలు కల్పించడం.. నచ్చని వారికి రివర్స్ ఇవ్వడం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర గవర్నర్ స్పందించి రామకృష్ణారెడ్డిని రీకాల్‌చేసి విగ్రహ ఏర్పాటును అడ్డుకోకపోతే విద్యార్థుల తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు, రజనీ, ఉమామహేష్, నారాయణ స్వామి, మంజు, విష్ణు, ప్రకాష్ పాల్గొన్నారు.