మీ సమస్యల పరిష్కారానికి నేనున్నా : జేసీపీఆర్
ABN , First Publish Date - 2023-11-22T00:17:19+05:30 IST
మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నేనున్నానని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ కాలనీలో మంగళవారం జేసీ పర్యటిం చారు.

తాడిపత్రి, నవంబరు21: మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి నేనున్నానని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ కాలనీలో మంగళవారం జేసీ పర్యటిం చారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు వచ్చాయో ఆరాతీశారు. రాబో యేది టీడీపీ ప్రభుత్వమని ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటిని పరిష్క రించి మీ సంక్షేమం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ వైస్‌చైర్మన అబ్దుల్‌రహీం, కౌన్సిలర్లు అరుణ, మల్లికార్జున రేష్మాపర్వీన, షెక్షావలి తదితరులు ఉన్నారు.