భక్తి శ్రద్ధలతో హోమం
ABN , First Publish Date - 2023-12-11T00:04:58+05:30 IST
మండల పరిధిలోని రాచపల్లి సమీపంలోని ఓ తోటలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధాత్రి హోమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
హిందూపురం అర్బన, డిసెంబరు 10: మండల పరిధిలోని రాచపల్లి సమీపంలోని ఓ తోటలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధాత్రి హోమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పరస్కరించుకొని ఆదివారం ఉసిరి చెట్టువద్ద ధాత్రి దామోదర హోమం, తులసి పూజ, గోపూజ చేశారు. మహా విష్ణువుకు ప్రీతకరమైన ధాత్రి దామోదర హోమం చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని వేదపండితులు తెలిపారు. అదే విధంగా తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం, గోపూజ వల్ల ముక్కోటి దేవ తలను పూజించిన పుణ్యఫలం దక్కుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం వనభోజనాలు నిర్వహించి, కార్తీక మాసం పవిత్రను తెలియజేశారు.