హమ్మయ్య.. వానొచ్చిందోచ
ABN , First Publish Date - 2023-09-04T00:21:39+05:30 IST
ధర్మవరంరూరల్, సెప్టెంబరు3: హమ్మయ్య ఎట్టకేలకు వానొచ్చింది.. గత నెలరోజుల నుంచి వర్షం కురవకపోవడంతో పాటు ఎండతీవ్రత పెరిగింది.
ధర్మవరంరూరల్, సెప్టెంబరు3: హమ్మయ్య ఎట్టకేలకు వానొచ్చింది.. గత నెలరోజుల నుంచి వర్షం కురవకపోవడంతో పాటు ఎండతీవ్రత పెరిగింది. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. ప్రజలు కూడా ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో వర్షం ఎప్పుడొస్తుందా అన్ని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వరుణుడు కరుణించాడు. మండలవ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురిసింది. ఎండుముఖం పెట్టిన పంటలకు ఊపిరి వచ్చినట్లు అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు సైతం వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు.