Share News

హలో మాదిగ చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి : డీహెచపీఎస్‌

ABN , First Publish Date - 2023-10-22T23:51:31+05:30 IST

హలో మాదిగ చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీహెచపీఎస్‌ నాయకులు పిలుపు నిచ్చారు.

హలో మాదిగ చలో హైదరాబాద్‌ను   విజయవంతం చేయండి : డీహెచపీఎస్‌

మడకశిరటౌన, అక్టోబరు 22: హలో మాదిగ చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీహెచపీఎస్‌ నాయకులు పిలుపు నిచ్చారు. వారు ఆదివారం సంబంధిత కరపత్రాలను పట్టణంలోని అంబేడ్క ర్‌ సర్కిల్‌లో విడుదల చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. విశ్వరూప్‌ మహా పాదయాత్రకు మద్దతుగా మండల పరిధిలోని గౌడనపల్లి వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జాతి భవిష్యత్తు కోసం గద్వాల్‌ జిల్లా ఆలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు చేస్తున్న పాదయాత్రకు, రథయాత్రకు మద్దతు తెలపాలన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని విశ్వరూప్‌ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీహెచపీఎస్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ హనుమంతు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు లక్ష్మీనరసప్ప, రంగస్వామి, శివన్న, రామకృష్ణ, భూతన్న, మహలింగన్న, ఐదు మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-22T23:51:31+05:30 IST