దుర్గంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2023-06-01T00:31:27+05:30 IST

మండల వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

దుర్గంలో భారీ వర్షం

రాయదుర్గం టౌన/రూరల్‌, మే 31: మండల వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాయదుర్గం దాసప్ప లేఔట్‌, కొలిమివీధి, రామస్వామివీధి, మధుటాకీస్‌ ఏరియా తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాల్వల్లో నీరు రహదారులపై చేరింది. రాయంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు ఏర్పాటు చేసుకున్న గోడౌనరేకులు గాలికి ఎగిరి పొలంలో పడ్డాయి. అదే విధంగా కోళ్లఫాం లోని 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో రూ. రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు నాగరాజు తెలిపారు. ప్రభుత్వం ఆదుకో వాలని ఆయన కోరారు.

గుమ్మఘట్ట: మండలంలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం సా యంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కు రుస్తుండటంతో మేకలు, గొర్రెలు చెట్టుకిందకు చేరాయి. ఈ సందర్భంలో పిడుగు పడడంతో చెట్టు కింద ఉన్న 10 గొర్రెలు మృతి చెందినట్లు కాపరి పరమేశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రెలను మేపుకొని జీవనం సాగిస్తున్న తనకు ఉన్న గొర్రెలన్నీ ఒక్కసారిగా మృతి చెందడంతో దా దాపు రూ. రెండు లక్షలు నష్టం వాటిల్లిందని పరమేశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-06-01T00:31:27+05:30 IST