ఘనంగా కనకదాస జయంతి
ABN , First Publish Date - 2023-12-10T23:40:43+05:30 IST
మండలంలోని బండమీదపల్లిలో ఆదివారం కనకదాస జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ఇనచార్జ్ బీకే పార్థసారధి, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు కనకదాస విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
రాప్తాడు, డిసెంబరు 10: మండలంలోని బండమీదపల్లిలో ఆదివారం కనకదాస జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ఇనచార్జ్ బీకే పార్థసారధి, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు కనకదాస విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీకే మాట్లాడుతూ కరుబలు సమష్టిగా ఉంటూ రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో కరుబ నాయకులు కొండప్ప, గంగలకుంట రమణ, కిష్టా, వేణుగోపాల్, నీళ్లపాల రాజగోపాల్, మాజీ డీలర్ శంకర్, దేవర నారాయణస్వామి, కిష్టా, బోడమల్లు, సూర్యనారాయణ, నాగరాజు, కుల పెద్దలు పాల్గొన్నారు.