ఘనంగా కనకదాసు జయంతి
ABN , First Publish Date - 2023-12-01T00:09:54+05:30 IST
పుట్టపర్తిరూరల్, నవంబరు 30: కురుబల ఆరాఽధ్యుడు భక్తకనకదాసు జయంతివేడుకలను పట్టణంలోని కురుబ సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, నవంబరు 30: కురుబల ఆరాఽధ్యుడు భక్తకనకదాసు జయంతివేడుకలను పట్టణంలోని కురుబ సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా కనక దాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిసదనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ కార్యాలయంలో భక్తకనకదాసు జయంతి వేడుకలను నిర్వహించిందన్నారు. అయితే కురుబ సా మాజిక వర్గానికి ప్రాతినిత్యం వహిస్తున్న ప్రజాప్రతినిఽధులు హిందూపురం ఎంపీ , పెనుకొండ ఎమ్యెల్యే, కురుబ కార్పొరేషన చైర్మన హాజరుకాకపోవడం శోచనీయమన్నారు. కనకదాసు జయం తి వేడుకలకు హాజరుకావడానికి వారికి సమ యం లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు సామకోటి ఆదినారాయణ, గౌరవాధ్యక్షుడు శివానంద, ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు పాల్గొన్నారు.