ఘనంగా కనకదాస జయంతి
ABN , First Publish Date - 2023-11-30T23:59:00+05:30 IST
కనకదాస జయంతి సందర్భంగా స్థానిక గుత్తి రోడ్డులోని ఆయన విగ్రహానికి స్ర్తీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ గౌతమి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్ : కనకదాస జయంతి సందర్భంగా స్థానిక గుత్తి రోడ్డులోని ఆయన విగ్రహానికి స్ర్తీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్, కలెక్టర్ గౌతమి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనకదాస కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఆయన కీర్తనలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కురబ అభివృద్ధి, కార్పొరేషన ఛైర్మన కోటి సూర్యప్రకాష్‌బాబు, జిల్లా గ్రంథాలయ ఛైర్‌పర్సన ఉమాదేవి, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొతారీ, బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రమణ్యం, రిటైర్డ్ జిల్లా జడ్జి కృష్టప్ప పాల్గొన్నారు.