ఘనంగా అవ్వాతాతల దినోత్సవం
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:03 AM
మండల వ్యాప్తంగా ఎస్‌కే చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలువల బడులలో గురువారం అవ్వాతాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
కుందుర్పి, డిసెంబరు 28: మండల వ్యాప్తంగా ఎస్‌కే చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలువల బడులలో గురువారం అవ్వాతాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఎనుములదొడ్డి విలువలబడికి ట్రస్టు నిర్వాహకులు లెనిన్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పండుగ వాతావరణంలో అవ్వతాతల దినోత్సవం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. విద్యార్థులంతా వారి అ వ్వతాతలకు పాదపూజ కార్యక్రమం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం బహుమతులను అందజేశారు. ట్రస్టు సభ్యులు రాజు, బొమ్మలింగ, శ్రీకాం త్, రఘువీరా, లక్ష్మణమూర్తి, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.