గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:52 AM
పుట్టపర్తి రూరల్/ కొత్తచెరువు/ ధర్మవరం రూరల్, డిసెంబరు 13: మండలంలోని పైపల్లి గ్రామంలో బుధవారం టీడీపీ శ్రేణులు బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్/ కొత్తచెరువు/ ధర్మవరం రూరల్, డిసెంబరు 13: మండలంలోని పైపల్లి గ్రామంలో బుధవారం టీడీపీ శ్రేణులు బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొని వారితో పాటు ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ మినీమేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచు ప్రవీణ్‌కుమార్, పార్టీ రూరల్‌కన్వీనర్ విజయ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లి క్వార్టర్స్‌లో టీడీపీ శ్రేణులు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్నినిర్వహించి మినీమేనిఫెస్టోపై ప్రచారం చేపట్టారు. పట్టణ టీడీపీ కన్వీనర్ ఒలిపిశ్రీనివాసులు, నాయకులు డ్రైవర్ కేశప్ప, పెద్దన్న, బద్రి పాల్గొన్నారు ఇక ధర్మవరం మండలం ధర్మపురి గ్రామంలో టీడీపీ నాయకులు బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఇంటింటీకి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి మినీమేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరించారు. మాజీ జడ్పీటీసీ మేకలరామాంజనేయులు, నాయకులు భాస్కర్‌చౌదరి, శివరామరాజు, దేవరకొండ గోవిందు తదితరులు పాల్గొన్నారు.