నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స పరీక్షలు

ABN , First Publish Date - 2023-06-03T00:58:55+05:30 IST

గ్రూప్‌-1 మెయిన్స పరీక్షలు శనివారం నుంచి ప్రా రంభం కానున్నాయి. 10వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రధాన భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స పరీక్షలు
ఏపీపీఎస్సీ అధికారులతో చర్చిస్తున్న ప్రొఫెసర్‌ సుజాత

హాజరుకానున్న 522 మంది అభ్యర్థులు

అనంతపురం సెంట్రల్‌, జూన 2: గ్రూప్‌-1 మెయిన్స పరీక్షలు శనివారం నుంచి ప్రా రంభం కానున్నాయి. 10వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రధాన భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సుజాత పరిశీలించారు. అనంతరం లైజనింగ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులుతో ఆమె తన కార్యాయంలో చర్చించారు. 522 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే పరీక్షలకు మొత్తం 23 గదులను కేటాయించామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గది కేటాయించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా ప్రారంభం సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టంచేశారు. అదేవిధంగా కళాశాల అధికారులు, సిబ్బంది పరీక్షా సమయానికి లోపే విధులకు హాజరుకావాలని తెలిపారు. పరీక్షలు ప్రారంభం కాగానే వారిని కార్యాలయం నుంచి బయటకు అనుమతించమని సూచించారు. విద్యార్థులకు షెడ్యూల్‌ మేరకు పరీక్షలు ఉంటాయిని, మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీపీఎ్‌ససీ అధికారులు బ్రహ్మేశ్వరరావు, బాలరాజు, బాబురావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:58:55+05:30 IST