ఘనంగా నాగుల ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2023-11-19T23:53:18+05:30 IST
స్థానిక బోగసముద్రం చెరువు వద్ద ఘనగిరి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగుల ప్రతి ష్ఠను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

పెనుకొండ, నవంబరు 19 : స్థానిక బోగసముద్రం చెరువు వద్ద ఘనగిరి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగుల ప్రతి ష్ఠను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు వేద బ్రహ్మ పంచాంగం నాగప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్ర మాలు, హోమాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన మందుల దుకా ణం యజమాని సుధాకర్, రమాదేవి దంపతులచేత పూజా కార్యక్ర మా లు చేయించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పూర్ణాహుతి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.