జీఓ నెం.117ను రద్దుచేయాలి : ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2023-05-31T23:59:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 117 జీఓను తక్షణమే రద్దుచేయాలని, ఉపాధ్యాయుల బదిలీలకు పాతపద్ధతిలో మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్‌ డిమాండ్‌చేశారు.

జీఓ నెం.117ను  రద్దుచేయాలి : ఏపీటీఎఫ్‌

కొత్తచెరువు, మే 31: రాష్ట్ర ప్రభుత్వం 117 జీఓను తక్షణమే రద్దుచేయాలని, ఉపాధ్యాయుల బదిలీలకు పాతపద్ధతిలో మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఏపీటీఎఫ్‌ పుట్టపర్తి జోన సమావేశాన్ని మండల అధ్యక్షుడు సాయిశివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోనంకి అశోక్‌కుమార్‌ హాజరై మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యా యుల బదిలీల్లో అసంబద్ధతలను సరిచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ మాధవ, నాయకులు భాస్కర్‌; జయరాం, హరిప్రసాద్‌, రామసుబ్బమ్మ, చలపతి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:59:42+05:30 IST