నకిలీ నాణేలు ఇచ్చి రూ. 2 లక్షలతో ఉడాయింపు

ABN , First Publish Date - 2023-03-26T00:09:33+05:30 IST

మండలంలోని కాశేపల్లి టోల్‌గేట్‌ వద్ద శనివారం బంగారు నాణేలను ఆశచూపి దీపిక అనే మహి ళను మోసం చేసి రూ.2లక్షల నగదుతో ఉడాయించినట్లు ఎస్‌ఐ రాజశే ఖర్‌ రెడ్డి తెలిపారు.

నకిలీ నాణేలు ఇచ్చి రూ. 2 లక్షలతో ఉడాయింపు

పెద్దవడుగూరు, మార్చి 25: మండలంలోని కాశేపల్లి టోల్‌గేట్‌ వద్ద శనివారం బంగారు నాణేలను ఆశచూపి దీపిక అనే మహి ళను మోసం చేసి రూ.2లక్షల నగదుతో ఉడాయించినట్లు ఎస్‌ఐ రాజశే ఖర్‌ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలమేరకు హైదరాబాద్‌కు చెం దిన దీపికకు తిరుపతిలో ఏడాదిక్రితం ఒక వ్యక్తి పరిచయమ య్యాడ న్నారు. 20 రోజులక్రితం దీపికకు ఆ వ్యక్తి ఫోనచేసి తనవద్ద బంగారు నాణేలు ఉన్నాయని మార్కెట్‌ధర కంటే తక్కువ ధరకు ఇస్తా నని ఆశచూపాడు. బంగారు నాణేలను కొనుగోలుచేసేందుకు హైదరా బాద్‌ నుంచి కర్ణాటకలోని హోస్పేటకు వెళ్లింది. అక్కడ మార్కెట్‌రేటు కంటే తక్కువ ధరకు అతనివద్ద నుంచి 2బంగారు నాణేలను కొనుగో లుచేసి పరీక్షించింది. పరీక్షలో బంగారు నాణేలని తేలడంతో వాటిని తనవెంట తీసుకువెళ్లింది. రెండురోజులక్రితం అదేవ్యక్తి మరోసారి ఫోనచేసి తన వద్ద 20 బంగారు నాణేలు ఉన్నాయని వాటిని రూ.2 లక్షలకు విక్ర యిస్తున్నట్లు తెలిపాడు. వీటిని కొనుగోలుచేసేందుకు మరోసారి హైదరాబాద్‌ నుంచి కాశేపల్లి టోల్‌ప్లాజా వద్దకు వచ్చింది. టోల్‌ప్లాజా వద్ద తనకు పరిచయమైన వ్యక్తితోపాటు మరో ఇద్దరు దీపిక కోసం ఎదురుచూశారు. ఫోన సమాచారం అనుసరించి వారు ఉన్న చోటికి వెళ్లింది. తనవద్ద ఉన్న నాణేలను ఆమెకు ఇచ్చి ఆమె వద్ద ఉన్న రూ.2లక్షలను వారు తీసుకున్నారు. బంగారు నాణేలను పరీక్షించేందుకు ప్రయత్నించగా వారిలోని ఒకరు పోలీసులు వస్తున్నట్లు కేకలు వేస్తూ వారందరూ పరారయ్యారు. అక్కడే దీపిక తనవద్ద ఉన్న నాణేలను పరీక్షించి చూడగా అందులో రెండు నాణేలు మాత్రమే ఒరిజినల్‌గా మిగిలిన 18 నాణేలు నకిలీ నాణేలుగా తేలింది. వారి చేతుల్లో నుంచి మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పెద్దవడుగూరు పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు అనుసరించి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-26T00:09:33+05:30 IST