‘పేదలకు సాగుపట్టాలు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2023-09-17T23:55:01+05:30 IST

మండలంలోని కోగిర, శ్యాపురం, కంబలపల్లి తదితర గ్రామాల నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూమికి సాగుపట్టా ఇవ్వాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

‘పేదలకు సాగుపట్టాలు ఇవ్వాలి’

రొద్దం, సెప్టెంబరు 17 : మండలంలోని కోగిర, శ్యాపురం, కంబలపల్లి తదితర గ్రామాల నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూమికి సాగుపట్టా ఇవ్వాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని శ్యాపురం గుట్టల్లో ఉలవలు వేయడానికి నిరుపేద కూలీలు ఆదివారం వెళ్లారు. అయితే పోలీసులు, రెవె న్యూ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనేక ఏళ్లుగా సెంటు భూమిలేక ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నామని పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని కూలీలు కోరారు. టింబక్టివ్‌ కలెక్టివ్‌ స్వచ్ఛంద సంస్థకు వేలాది ఎకరాలు ఇచ్చి నిరుపేదలకు ఎందుకు పట్టాలు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దన్న, సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, రంగప్ప, నరసింహప్ప, అనిత, రామాంజనమ్మ, బాలు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T23:55:01+05:30 IST