టీడీపీతోనే భవిష్యతకు గ్యారెంటీ
ABN , First Publish Date - 2023-09-04T23:31:48+05:30 IST
టీడీపీతోనే అన్ని వర్గాల భవిష్యతకు గ్యారెంటి ఉంటుందని మాజీ కార్పొరేటర్ రాజారావు అన్నా రు. సోమవారం అనంతపురం అర్బన పరిధిలోని 35వ డివిజనలో బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 4: టీడీపీతోనే అన్ని వర్గాల భవిష్యతకు గ్యారెంటి ఉంటుందని మాజీ కార్పొరేటర్ రాజారావు అన్నా రు. సోమవారం అనంతపురం అర్బన పరిధిలోని 35వ డివిజనలో బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మెనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో అంజి, మల్లేష్, సుధాకర్ పాల్గొన్నారు.
మహిళా మహాశక్తి చైతన్య యాత్ర
అనంతపురంరూరల్: మండలంలోని అర్బన నియోజకవర్గం రుద్రంపేట పంచాయతీలో మహిళా మహాశక్తి చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల ఆధ్వర్యంలో టీడీపీ మహిళలు, నాయకులు ఇంటింటికి తిరుగుతూ.. మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరించారు. టీడీపీ గెలుపు కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ గౌడ్, బాలప్ప, సుజాత, బాషా, కుమార్, అనుబంధ సంఘాల నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.