కబడ్డీ అసోసియేషన జిల్లా కమిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2023-11-19T23:38:14+05:30 IST
కబడ్డీ అసోసియేషన జిల్లా కమిటీని ఆదివారం ఉదయం గుంతకల్లులో ప్రకటించారు.

గుంతకల్లు, నవంబరు 19: కబడ్డీ అసోసియేషన జిల్లా కమిటీని ఆదివారం ఉదయం గుంతకల్లులో ప్రకటించారు. స్థానిక మార్కెట్ రోడ్డులోని ఇల్లూరు యోగా సెంటరులో ఈ సంఘ రాష్ట్ర సీఈఓ వీర లంకయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన రాష్ట్ర అబ్జర్వరు శ్రీనివాసులు పరిశీలకుడిగా, హ్యూమన రైట్స్ ప్రొటెక్షన ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ కృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారిగా హాజరయ్యారు. ఎన్నిక కార్యక్రమంలో పోటీ లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన అధ్యక్షుడిగా ఆర్ రామతేజ్ గౌడు, కార్యదర్శిగా ఆర్ రామయ్య, కోశాధికారిగా బీ రాజేశ, ఉపాధ్యక్షులుగా జూటూరు నాగరాజు, వై అనుదీప్ రెడ్డి, మంజుల వెంకటేశ, సంపత కుమార్, పురుషోత్తం, సంయుక్త కార్యదర్శులుగా శ్రీధర్‌రెడ్డి, ప్రసాద్, మధుచైతన్య, డీ అంజనాబాయ్, ఎం మల్లికార్జున, కార్యనిర్వాహక సభ్యులుగా నాగ నరసింహులు, టీ మీనా కుమారి, కే నాగభూషణం, పరశురాం కుమార్, బీ మారుతీ కుమార్, ప్రదీప్ కుమార్‌లను నియమించారు.