ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2023-11-20T23:51:47+05:30 IST
రియల్ ఎస్టేట్‌పై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు.

ఎమ్మెల్యేకు మాజీ మంత్రి పరిటాల సునీత హితవు
అనంతపురంరూరల్, నవంబరు 20: రియల్ ఎస్టేట్‌పై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. సోమవారం సాయంత్రం మండలంలోని పాపంపేటలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జనసేన నియోజకవర్గం ఇనచార్జ్ సాకే పవనకుమార్, టీడీపీ మండల కన్వీనర్ జింకాసూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, గాండ్ల విశాలాక్షి, మాజీ ఎంపీపీ మాధవి, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, జనసేన మండల కన్వీనర్ వెంకటేష్, వైస్ కన్వీనర్ గంగాధర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్ చల్లాజయకృష్ణ, నాయకులు తాడాల నాగభూషణం, లింగయ్యయాదవ్, శ్రీరాములు, పేరం హరి, రామాంజినేయలు, గోవిందు, రతన్నమోహన, బాబావలి, దస్తగిరి, సాంబశివ, షపీ, బాబుప్రసాద్, లక్ష్మిదేవి పాల్గొన్నారు.