మోడల్‌ స్కూల్‌లో మంటలు

ABN , First Publish Date - 2023-06-01T00:03:03+05:30 IST

మండలంలోని గాజుపల్లి సమీపాన గల మోడల్‌ స్కూల్‌లో బుధవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

 మోడల్‌ స్కూల్‌లో మంటలు

షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం

సెలవులు కావడంతో తప్పిన ముప్పు

అమడగూరు, మే 31: మండలంలోని గాజుపల్లి సమీపాన గల మోడల్‌ స్కూల్‌లో బుధవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. షార్ట్‌ సర్క్యూట్‌తో పాఠశాల భవనం మొదటి అంతస్తులోని గదిలో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి, పాఠశాల సిబ్బంది, విద్యుత శాశాధికారులకు సమాచారం అదించారు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేశారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఊళ్లకు వెళ్లారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

Updated Date - 2023-06-01T00:03:03+05:30 IST