బాబు బయటకు వచ్చే వరకు పోరాటం: టీడీపీ

ABN , First Publish Date - 2023-09-20T00:06:50+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన బయటకు వచ్చేవరకు పో రాటాలు కొనసాగిద్దామని టీడీపీ నాయకులు తీర్మానించారు.

బాబు బయటకు వచ్చే వరకు పోరాటం: టీడీపీ

హిందూపురం, సెప్టెంబరు 19 : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన బయటకు వచ్చేవరకు పో రాటాలు కొనసాగిద్దామని టీడీపీ నాయకులు తీర్మానించారు. వారు మంగళవారం పట్టణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు బయటకు వచ్చేవరకు మన ఉద్యమం ఆగకూడదని కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కక్షగట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ నిరసనలో చంద్రబాబుకు మద్దతు పలుకుదామని తీర్మానించారు. టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, కన్వీనర్లు రమేష్‌, అశ్వత్థరెడ్డి, జయప్ప, అమర్నాథ్‌, నారాయణరెడ్డి, జేపీకే రాము, శ్రీదేవి, నబీరసూల్‌, హెచఎన రాము, అనీల్‌, రామాంజనమ్మ, ఆనందప్ప, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:06:50+05:30 IST